అత్యధిక కాలం ప్రధానిగా చేసిన మోదీని ప్రశంసిస్తూ ఇవాళ కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. నేటితో వరుసగా 4399 రోజుల పాటు మోదీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు

న్యూఢిల్లీ: అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా మోదీ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. గతంలో నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఆయన బ్రేక్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. అత్యధిక రోజులు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన మోదీని ప్రశంసిస్తూ కేంద్ర క్యాబినెట్ ఇవాళ తీర్మానం పాస్ చేసింది. క్యాబినెట్లో ఉన్న మంత్రులు అందరూ ఆ మీటింగ్లో పాల్గొన్నారు. మోదీపై ప్రశంసలు కురిపిస్తూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ ప్రకటన చేశారు. ఆ తర్వాత మంత్రులందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.
