అమెరికా దళాలపై ఇరాన్ విరుచకుపడింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా దళాలకు చెందిన ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి చేసింది.

టెహ్రాన్: అమెరికా దళాలపై ఇరాన్(Iran Strikes) విరుచకుపడింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా దళాలకు చెందిన ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి చేసింది ఇరాన్. అయితే ఈ దాడి గురించి జోర్డాన్ కానీ, అమెరికా కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మువాఫక్ సాల్టీ ఎయిర్ బేస్‌పైకి క్షిపణులతో దాడి చేసినట్లు ఇరానీ పారామిలిటరీ రెవల్యూషనర్ గార్డులు పేర్కొన్నారు. ఈ ఎయిర్‌బేస్‌లో అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాలతో పాటు ఇతర విమానాలు ఉన్నాయి. హోర్ముజ్ వద్ద మంగళవారం అమెరికాకు చెందిన ఆర్మీ అపాచీ హెలికాప్టర్ కూలిన విషయం తెలిసందే. ఆ ఘటన నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగింది. దీంతో ఆ దాడుల్ని తిప్పికొట్టేందుకు ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది
