పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది

మహబూబ్నగర్, జూన్ 9 : పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్కు చెందిన తుప్పరి కృష్ణయ్య ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు తుప్పరి కార్తీక్ (23) ఉన్నారు. కార్తీక్ పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేడేట్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వేసవి సెలవులు ముగియడంతో సోమవారం రాత్రి 9:45 హాస్టల్కు వచ్చాడు
