అంగన్వాడీ వ్యవస్థనే లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా గత సంవత్సరం పూర్వ ప్రాథమిక విద్యా పథకంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను తెరపైకి తెచ్చింది.

అంగన్వాడీ వ్యవస్థనే లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా గత సంవత్సరం పూర్వ ప్రాథమిక విద్యా పథకంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను తెరపైకి తెచ్చింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతేడాది 21 స్కూళ్లను ప్రారంభించగా.. ఈ ఏడాది ఏకంగా 118 స్కూళ్లను ఏర్పాటు చేయనుంది. ఈ స్కూళ్లలో టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేసేందుకు కూడా సిద్ధమైంది. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి చిన్నారుల ఆరోగ్య రక్షణతోపాటు ఆటపాటలతో కూడిన విద్య నేర్పిస్తున్న అంగన్వాడీల స్కూళ్లకు రేవంత్ సర్కార్ మంగళం పలికేటట్లు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు
