బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ శ్రీ రామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ /పీజీ కళాశాలలో 2026-2027 డిగ్రీ, పీజీలో ప్రవేశాల కోసం మంగళవారం ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు.

బాన్సువాడ రూరల్, జూన్ 9 : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ శ్రీ రామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ /పీజీ కళాశాలలో 2026-2027 డిగ్రీ, పీజీలో ప్రవేశాల కోసం మంగళవారం ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఇందూరు గంగాధర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం డిగ్రీలో ప్రవేశాల కోసం అత్యధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. దోస్త్ అప్లికేషన్లో జిల్లాలో ఎస్.ఆర్.ఎన్.కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు.
