ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ శివారులో కొందరి రైతుల పంట పొలాల్లో 20 మొసలి పిల్లలు కనిపించిన ఘటన కలకలం .

సదాశివపేట(సంగారెడ్డి): ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ శివారులో సోమవారం కొందరి రైతుల పంట పొలాల్లో 20 మొసలి పిల్లలు కనిపించిన ఘటన కలకలం రేపింది. గ్రామ శివారులో పశువులను కాసేందుకు వెళ్లిన పశువుల కాపరులకు 20 మొసలి పిల్లలు కనిపించాయి. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్టు అధికారులు మొసలి పిల్లలను పట్టుకున్నారు. అనంతరం సమీప ప్రాంతంలో దాదాపు 60 మొసలి గుడ్లను గుర్తించారు.
