జిల్లాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోజురోజుకూ ప్రైవేట్ పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నది.

కామారెడ్డి, జూన్ 7 : జిల్లాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోజురోజుకూ ప్రైవేట్ పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నది. ఏడాదికేడాది పదో తరగతి పరీక్షల్లో ఆశించిన మేరకు ఫలితాలూ రావడంలేదు. దీంతో జిల్లాలో విద్యావ్యవస్థ గాడిలో పడేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో హంగులతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. పేద విద్యార్థులుకు కొండంత అండగా నిలిచారు.
