కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. నీట్-యూజీ, ఎస్సెస్సీ, సీయూఈటీ, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా నిర్వహించలేక ప్రభుత్వం చేతులెత్తేస్తున్నది.

హైదరాబాద్ : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. నీట్-యూజీ, ఎస్సెస్సీ, సీయూఈటీ, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా నిర్వహించలేక ప్రభుత్వం చేతులెత్తేస్తున్నది. దీంతో పరీక్ష విధానాల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలను తాళలేక, పరీక్షలను తిరిగి రాయలేక పలువురు విద్యార్థులు ఉసురు తీసుకొంటున్నారు. ప్రస్తుతం దేశంలో పరీక్షలు బాగా రాయాలని కాకుండా, పరీక్ష పేపర్ లీక్ కాకుండా.. ఎగ్జామ్ రద్దు కాకుండా చూడాలని ప్రార్థించే పరిస్థితి వచ్చిందని నెటిజన్లు మండిపడుతున్నారు.
