బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాధర్, నాయకులు ఆలూరి నరేందర్, భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్వీ నాయకులు వంశీ గౌడ్, కిశోర్ గౌడ్, కుమ్మెర తిరుపతయ్యను తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నాడు తొలిరోజు పర్యటన మమ అనిపించింది. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం 3:15 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్‌కు కర్ణాటక మాజీ మంత్రి బోసు రాజుతో కలసి నేరుగా ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఉన్నారు. మక్తల్ మండలం కాట్రేవుపల్లి సమీపంలో కొనసాగుతున్న నారాయణపేట- కొడంగల్ ఎతిపోతల పనులను పరిశీలించారు
