నేటి నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయని మెదక్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి రాజు గురువారం ప్రకటనలో తెలిపారు.

మెదక్ మున్సిపాలిటీ, జూన్ 4: నేటి నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయని మెదక్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి రాజు గురువారం ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లాలో 487 మంది విద్యార్థులు పరీక్షల రాయనున్నారని, ఇందుకోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
