చేనేత కళాకారుల ప్రతిభను అందిరికీ తెలియజేయడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం, మార్కెటింగ్ కల్పించాలనే లక్ష్యంతో ‘థ్రెడ్ పోచంపల్లి’ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టనుంది.

యాదాద్రి భువనగిరి: చేనేత కళాకారుల ప్రతిభను అందిరికీ తెలియజేయడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం, మార్కెటింగ్ కల్పించాలనే లక్ష్యంతో ‘థ్రెడ్ పోచంపల్లి’ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టనుంది. శుక్రవారం హైదరాబాద్‌లో చేనేత కళా వైభవం ఆవిష్కృతం కానుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంప్రదాయ వస్ర్తాలు, హస్తకళలు, స్థానిక వంటకాల పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం రాష్ట్ర మంత్రులు ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు.
