ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, గన్నీ సంచులు, లారీల కొరతను నిరసిస్తూ రైతులు మండలంలోని పాలడుగు హైవే పై ఆందోళనకు దిగారు. బుధవారం గ్రామంలోని రహదారిపై రైతులు బైఠాయించి గంటకు పైగా ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి.

మోత్కూరు, జూన్ 3 : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, గన్నీ సంచులు, లారీల కొరతను నిరసిస్తూ రైతులు మండలంలోని పాలడుగు హైవే పై ఆందోళనకు దిగారు. బుధవారం గ్రామంలోని రహదారిపై రైతులు బైఠాయించి గంటకు పైగా ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. పోలీసులు వచ్చి రైతులను సముదాయించినా వినకుండా రహదారిపై ఆందోళన చేపట్టారు. నెలన్నర నుంచి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని రైతులు మండి పడ్డారు.
