‘తెలంగాణ కోసం ఒక్కడిగా బయలుదేరారు. పిడికిలి బిగించి కోట్లాది మందిని ఏకంచేశారు. రాజకీయ పదవులను గడ్డిపూసతో సమానంగా భావించారు

ఖమ్మం సిటీ, జూన్ 2: ‘తెలంగాణ కోసం ఒక్కడిగా బయలుదేరారు. పిడికిలి బిగించి కోట్లాది మందిని ఏకంచేశారు. రాజకీయ పదవులను గడ్డిపూసతో సమానంగా భావించారు. చివరికి ప్రాణత్యాగానికి సైతం వెనుకాడలేదు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది’ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం (తెలంగాణ భవన్)లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా మంగళవారం నిర్వహించారు.
