పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ, మూడేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, పల్లెల్లో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు రాని దుస్థితి ఉన్నదని విమర్శించారు

జగిత్యాల కలెక్టరేట్, జూన్ 1 : పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ, మూడేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, పల్లెల్లో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు రాని దుస్థితి ఉన్నదని విమర్శించారు. రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన ఎనుగంటి రాములు తన తల్లితండ్రుల జ్ఞాపకార్థం సమకూర్చిన బాడీ ఫ్రీజర్‌ను సోమవారం ఆయన గ్రామ పంచాయతీకి అందజేశారు.
