కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులపై అధికారులు అలసత్వం వీడడం లేదు. నగరంలోని రోడ్ల మధ్యలో పైపులు వేసి ఏళ్లు గడుస్తున్నా.. కనెక్షన్లు ఇచ్చి వాటిని వినియోగంలోకి తేవడం లేదు

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులపై అధికారులు అలసత్వం వీడడం లేదు. నగరంలోని రోడ్ల మధ్యలో పైపులు వేసి ఏళ్లు గడుస్తున్నా.. కనెక్షన్లు ఇచ్చి వాటిని వినియోగంలోకి తేవడం లేదు. ప్రస్తుతం ఈ పనులు పూర్తికి అమృత్-2, యూఐడీఎఫ్ కింద సుమారు రూ.259 కోట్ల నిధులు రావడంతో మళ్లీ ఆశలు చిగురిస్తుండగా.. పాలకవర్గం సమ్మతి తెలుపుతుందా.. లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ శాఖల మధ్య సన్వయలోపం ఉందనే విమర్శలు వస్తున్నాయి.
