సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కొఠారి గ్రామంలో స్థానిక మహిళ ఒకరు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అక్కడున్న సమస్యలు తీసుకువెళ్లింది.

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొరాఠి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొఠారి గ్రామంలో స్థానిక మహిళ ఒకరు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అక్కడున్న సమస్యలు తీసుకువెళ్లింది. సార్ మా ఊర్లో స్కూల్ ఉంది కానీ దాంట్లో అంగన్వాడీ టీచర్ లేదు, ఆయమ్మ లేదు. మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నా సార్.. మా ఊర్లో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని సదరు మహిళ సీఎంతో తన బాధలు చెప్పుకున్నది.
