తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట బీఆర్ఎస్ ఓట్ల తొలగించే ప్రమాదముందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్వోలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముషీరాబాద్‌లోని శనివారం నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు

శనివారం ముషీరాబాద్‌లో కోలేటి దామోదర్ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సర్ పట్ల ప్రతి ఒక బీఆర్ఎస్ కార్యకర్త జాగ్రత్తగా ఉండాలని.. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసే ఓటర్ల నమోదుకు సంబంధించిన అవకతవకలపైనా జాగ్రత్త వహించాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పైన కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేలా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదే విధంగా పార్టీ తరఫున ఎంపిక చేసిన బూత్ లెవెల్ అసిస్టెంట్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
