ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మంజీరా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉ న్నాయి. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతున్నది.

చౌటకూర్, మే 28: ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మంజీరా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉ న్నాయి. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతున్నది. మండలంలోని శివంపేట, వెండికోలు, కోర్పోలు, సరాఫ్పల్లి, చౌటకూర్ గ్రామాల శివారు గుండా ప్రవహిస్తున్న మంజీరా నదిలో పెద్దఎత్తున సహజ సిద్ధంగా ఇసుక మేటలు ఏర్పడ్డాయి. ఇసుక మేటలపై కన్నేసిన అక్రమారులు కొందరు ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి, పగలు తేడాలేకుండా గాడిద లు, ట్రాక్టర్లపై ఒడ్డుకు చేర్చి ఇసుక నిల్వలు చేస్తున్నారు.
