ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్నది.. మార్కెట్ యార్డులో ఇబ్బంది పడుతున్నం..సారూ.. జొన్నలు కొనుండ్రి’ అంటూ ఆదిలాబాద్ కలెక్టర్కు మేడిగూడకు చెందిన రైతు క్యాతం రామిరెడ్డితో పాటు పలువురు రైతులు విన్నవించారు.

జైనథ్, మే 27 : ‘ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్నది.. మార్కెట్ యార్డులో ఇబ్బంది పడుతున్నం..సారూ.. జొన్నలు కొనుండ్రి’ అంటూ ఆదిలాబాద్ కలెక్టర్కు మేడిగూడకు చెందిన రైతు క్యాతం రామిరెడ్డితో పాటు పలువురు రైతులు విన్నవించారు. బుధవారం సాత్నాల మండలంలోని మేడిగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అకాల వర్షాల దృష్ట్యా జొన్నల కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్కు రైతులు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంట వెంటనే కొనుగోళ్లు చేపట్టి గోదాములకు తరలించాలని, డబ్బుల చెల్లింపులు త్వరగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు
