ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి అక్కడక్కడా ప్రతాపం చూపింది. ఈదురుగాలుల ప్రభావంతో నగరంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది.

కరీంనగర్ కార్పొరేషన్/ ముకరంపుర, మే 26: ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి అక్కడక్కడా ప్రతాపం చూపింది. ఈదురుగాలుల ప్రభావంతో నగరంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. సాయంత్రం తర్వాత ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై, గాలి దుమారం మొదలైంది. అధిక వేగంతో గాలి వీయడంతో దుమ్ము ధూళి ఎగిసిపడి, రోడ్లపై ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో జనం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఎత్తయిన భవనాలు, రోడ్ల వెంట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ చిరిగిపోయి విద్యుత్తీగలపై పడి పోయాయి
