రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగిరం చేయకుంటే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని సిద్దిపేట జిల్లా అధికార యంత్రాంగానికి , ప్రభుత్వానికి హరీశ్‌రావు హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు.

రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగిరం చేయకుంటే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని సిద్దిపేట జిల్లా అధికార యంత్రాంగానికి , ప్రభుత్వానికి హరీశ్‌రావు హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షలాది మంది రైతులు అరిగోస పడుతున్నారని అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రోహిణి కార్తె వచ్చినా మూడొంతుల వడ్లు కొనుగోళ్లు పూర్తి చేయలేదన్నారు. రైతులు మకలు అమ్మి రెండు నెలలైనా ఇంతవరకు రూపాయి రాలేదన్నారు.
