రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు పర్యటనతో సిరిసిల్ల ప్రజలను ఆకట్టుకున్నారు

హిమాన్షు రావు గతంలో కూడా పలుమార్లు సిరిసిల్లలో పర్యటించినప్పటికీ, ఈసారి పర్యటనలో మరింత మెచ్యూరిటీగా కనిపించారు. ఆత్మవిశ్వాసం, గంభీరం, హుందాతనం తో వ్యవహరించారు. పిన్న వయసులోనే దైవభక్తి అలవర్చుకోవడం, ఇతరులకు సహాయపడటం, ప్రోత్సహించడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. తాతకు తగ్గ మనవడు.. తండ్రికి తగ్గ తనయుడే అంటూ సిరిసిల్లలో చర్చించుకుంటున్నారు.
