అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ దగ్గర కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.

తక్షణమే అప్రమత్తమైన అధికారులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపి నిందితుడిని నిలువరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లోనే ఉన్నారని, ఆయన సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టంచేశారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. ఈ కాల్పుల ఘటనలో గాయపడిన పౌరుడి పరిస్థితి విషమంగా ఉందని, అతనికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది.
