ఇరాన్ తో ఒక విస్తృత శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందం తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. శనివారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్ ‘ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇరాన్ తో ఒక విస్తృత శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందం తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. శనివారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఒప్పందంపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్ దేశాల అధినేతలతో ఫోన్లో చర్చలు జరిపినట్లు తెలిపారు.
