కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే ధాన్యాన్ని లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని కామారెడ్డి-సిరిసిల్ల ప్రధాన రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.

కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే ధాన్యాన్ని లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని కామారెడ్డి-సిరిసిల్ల ప్రధాన రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసి పదిహేను రోజులు గడుస్తున్నా అలాట్మెంట్ చేసిన రైస్ మిల్లులకు తరలించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎండవేడిమికి ధాన్యం బస్తాలు బరువు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు
