స్కూల్ బ్యాగ్ మోయాల్సిన వయసులో, సైకిల్ తొక్కాల్సిన ఈడులో మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు ట్రాక్టర్ స్టీరింగ్ పట్టుకుని రోడ్కెక్కాడు.

ట్రాలీ నిండా మొరంతో రోడ్డుపై రయ్యిన దూసుకెళ్తున్న దృశ్యం స్థానికులను ఆశ్చర్యపర్చింది. సరిగ్గా బ్రేక్ వేయడం తెలియని వయసు, ఎదురుగా వచ్చే వాహనాలను అంచనా వేయలేని పసితనం.. ఒక్క సెకన్ ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదని చర్చించుకున్నారు. తల్లిదండ్రులు తమ అబ్బాయి బాగా నడుపుతాడు అనే మురిపెం తప్ప బిడ్డ ప్రాణం మీదకు తెస్తుందని ఆలోచించడంలేదు. మండలంలో మైనర్లు వాహనాలు నడపడం షరా మామూలైందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
