తమకేదో మంచి చేస్తాడని నమ్మి గెలిపించిన రైతులను సీఎ రేవంత్రెడ్డి దగా చేస్తున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు.

గురువారం ఆయన కోస్గిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి గత రెండు రోజుల కిందట కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడంగల్ రైతులకు మోస పూరితమైన హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత వారి జీవితాలతో చెలగాట మాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గన్నీ బ్యాగుల కొరత ఉన్నదని, రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేతగాక ఏదో ఒక సాకు చూపి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల కిందట అకాల వర్షంతో రైతులు ఆరబెట్టుకున్న దాన్యం నీటిలో తడిసిపోతే కనీసం పరిశీలించే సమయం కూడా కాంగ్రెస్ నాయకులకు లేదా అని ప్రశ్నించారు.
