ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న అమ్ముకుందామంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా అన్నదాత అధోగతి పాలవుతున్నాడు.

అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్‌యార్డులో గత నెల 17వ తేదీన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే అంతకు ముందే రైతులు మార్కెట్‌యార్డుకు మక్కలను తరలించడంతో మొదట్లో కొనుగోళ్లు గందరగోళంగా మారింది. ముందు వచ్చిన రైతులను కాకుండా రాజకీయ పలుకుబడి ఉన్న వారివే కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళన చేయడంతో అధికారులు క్రమసంఖ్య ఆధారంగా కొనుగోలు చేశారు
