రైతులు తాము పండించిన జొన్న ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కోరారు.

జైనూర్ : రైతులు తాము పండించిన జొన్న ధాన్యాన్ని ( Sorghum ) దళారులకు అమ్మి మోసపోవద్దని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ( MLA Kova Laxmi ) కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మార్కెట్ కమిటీ గోదాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్), మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు.
