రైతు బాగుంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందనే ధ్యాసే సీఎం రేవంత్‌రెడ్డికి లేదని, కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి అటు ప్రజలకు ఇటు రైతులకు అరిగోస తప్పడం లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం దౌల్తాబాద్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులతో కలిసి ధర్నా చేశారు.

కొడంగల్, మే 18 : రైతు బాగుంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందనే ధ్యాసే సీఎం రేవంత్‌రెడ్డికి లేదని, కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి అటు ప్రజలకు ఇటు రైతులకు అరిగోస తప్పడం లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం దౌల్తాబాద్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కోతలు ప్రారంభమై నెలరోజులు దాటినా వడ్లను సేకరించడంలో సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని దుయ్యబట్టారు.
