ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవె ల్లి, బజార్హత్నూర్, ఇచ్చో డ, ఉట్నూర్ మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టిం చింది. ఇండ్ల రేకులు ఊడి పోగా.. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవె ల్లి, బజార్హత్నూర్, ఇచ్చో డ, ఉట్నూర్ మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టిం చింది. ఇండ్ల రేకులు ఊడి పోగా.. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కల్లాల్లో ఆర బోసిన పంట ఉత్ప త్తులు తడిసిముద్దయ్యాయి. పలు లోతట్టు ప్రాం తాలు జలమయం అయ్యాయి. ఇంద్రవెల్లి మండలంలోని వాల్గొండా, వడగామ్, తేజాపూర్, సాలేగూడ, మోహన్సింగ్తండా, దస్నాపూర్, దోభిగూడ, గౌరాపూర్, పోల్లుగూడ, పాకిడిగూడ గ్రామాల్లో ఈదురు గాలులతోపాటు వడగాండ్ల వర్షం కురిసింది. మోహన్సింగ్తండా, వడగామ్, వాల్గొండా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి.
