కొనుగోలు కేంద్రాల వద్ద కర్షకులు కన్నీటి గోస అనుభవిస్తున్నారు. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నారు. ఓ వైపు పంటను కోసి కొనుగోలు కేంద్రాలకు తెచ్చినప్పటికీ.. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయడం లేదు. దీంతో అష్టకష్టాలు పడుతున్న రైతులకు ప్రకృతి వైపరీత్యాలు మరిన్ని పరీక్షలు పెడుతున్నాయి. మరోవైపు కొన్నిచోట్ల వారాల తరబడి నిరీక్షించిన రైతుల వద్ద పంటను కొనుగోలు చేసినప్పటికీ.. సకాలంలో తరలించకపోవడంతో అక్కడ కూడా అన్నదాతే బలిపశువు అవుతున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం అకాల వర్షాలకు తడవడంతో అక్కడ కూడా అన్నదాతే నిలువునా బలి అవుతున్నాడు

పంటను అమ్ముకునేందుకే వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న రైతులు.. అష్టకష్టాలు పడి పంటను అమ్ముకున్నాక.. ప్రభుత్వం ఆ పంటను తరలించుకొనిపోయే వరకూ రైతే బాధ్యత తీసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొనుగోలు చేసిన పంటను ప్రభుత్వం వారాల తరబడి తరలించకపోవడంతో దానిని కాపాడుతూ రైతులు కూడా అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ క్రమంలో అకాల వర్షాలు వచ్చి పంటంతా తడిచిపోతోంది..
