ఒకరికి 20 ఏళ్ల జైలు శిక్ష

తేదీ: 14 మే 2026 | గురువారం(శ్రీరామ్ చక్రీ న్యూస్)
సంగారెడ్డి జిల్లా, రాజంపేట:
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యాదగిరి అనే వ్యక్తికి POCSO ప్రత్యేక న్యాయమూర్తి శ్రీలేఖ 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు. కేసులో సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.నిర్మల్ జిల్లా, మామడ మండలం:ఓ గ్రామంలో అరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు ప్రాంతానికి చెందిన వీరయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.బాలలపై లైంగిక దాడుల ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
