రైతు సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందని, రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

రాష్ట్రంలో మంత్రులు రైతు సమస్యలపై కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. వరంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించి న రైతు సంగ్రామ సదస్సు విజయవంతం కావడంతో ప్రభుత్వం రైతు మేళా పేరిట మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. గడిచిన రెండున్నర సంవత్సరాల్లో రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.కాంగ్రెస్ నాయకులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతుల మేళా పెట్టాలని డిమాండ్ చేశారు.
