మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్‌లో ఇవాళ వైభవంగా వసంత పంచమి పూజలు నిర్వహించారు

ఇండోర్: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ఇవాళ మధ్యప్రదేశ్‌లోని దార్ జిల్లాలో ఉన్న 11వ శతాబ్ధం నాటి భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్‌లో వసంత పంచమి పూజలు నిర్వహించారు. భారీ భద్రత మధ్య పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో ఆ పూజలో పాల్గొన్నారు. సుమారు 8 వేల మంది పోలీసు, పారామిలిటరీ భద్రత ఏర్పాటు చేశారు. వివాదస్పదమైన భోజ్‌శాల-కమల్ మౌలా మసీదులో హిందువులు శుక్రవారం రోజు మొత్తం సరస్వతీ దేవి పూజలు చేసుకోవచ్చు అని గురువారం సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. అయితే మధ్యాహ్నం వేళలో ముస్లింలు కూడా ప్రార్థనలు చేసుకోవచ్చు అని కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే
