శివనగర్ లోని పలు ప్రాంతాల్లో భక్త మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఖిలావరంగల్: శివనగర్ లోని పలు ప్రాంతాల్లో భక్త మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ 34, 35 డివిజన్ల పద్మశాలి కమిటీల ఆధ్వర్యంలో భక్త మార్కండేయ జయంతి వేడుకలు పద్మశాలి కమ్యూనిటీ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశాలి జిల్లా కమిటీ ఈసీ మెంబర్ మేరుగు అశోక్ హాజరై మార్కండేయ చితపటానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్త మార్కండేయ స్ఫూర్తితో పద్మశాలీలు ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. అన్ని రంగాల్లో ముందుండి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.
