తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా కంపెనీకి సీబీఐ షాకిచ్చింది. కాంట్రాక్టు పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇస్తూ సుశీ ఇన్ఫ్రా కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. ఈ సుశీ ఇన్ఫ్రా లంచాల బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

సీబీఐ నమోదు చేసిన ఆ ఎఫ్ఐఆర్లో మంత్రి కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా కంపెనీ A-15 గా ఉన్నది. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్కు భారీగా లంచాలు ఇచ్చినట్టు సీబీఐ విచారణలో బయటపడింది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలోని పనుల కోసం అధికారులకు సుశీ ఇన్ఫ్రా లంచాలు ఇచ్చినట్లు గుర్తించింది.
