భీంగల్ మున్సిపాలిటీలో ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు భీంగల్ పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా మారిందో ప్రజలందరికీ తెలుసన్నారు.

భీంగల్, జనవరి 17: భీంగల్ ఎల్జే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భీంగల్ పట్టణ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలే మన పార్టీ బలానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో 40 పైగా సర్పంచులను, ఏడు మండల కేంద్రాల్లో ఐదు మండల కేంద్రాల సర్పంచ్లను మనమే గెలిపించుకున్నామని, గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.
