ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. ఈ స్కీమ్ అనగానే మొదట గుర్తొచ్చేది కర్ణాటక రాష్ట్రం. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసింది

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. హామీలు ఇచ్చేందుకు రెడీగా ఉంటాయి రాజకీయ పార్టీలు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు ఆ హామీలు అమలవుతున్న సమయంలో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తిన సందర్భాలు చాలా కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి హామీల్లో ఒకటి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. ఈ స్కీమ్ అనగానే మొదట గుర్తొచ్చేది కర్ణాటక రాష్ట్రం. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసింది. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు స్కీమ్‌ను అమలు చేసింది
