కారేపల్లి : విద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాసటగా నిలవాలని పూర్వ విద్యార్ధుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు.

కారేపల్లి : విద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాసటగా నిలవాలని పూర్వ విద్యార్ధుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. శుక్రవారం కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం హైస్కూల్లో పూర్వ విద్యార్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బాజుమల్లాయిగూడెం, చీమలపాడు, పాటిమీదగుంపు, నానునగర్‌తండా సర్పంచ్‌లు కోరం కోటమ్మ, మాలోత్ లలిత, గుగులోత్ సుజాత, మాలోత్ విజయకుమారిలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్దులలో ఒకరైన సీఐ పోతుల శ్రీధర్‌ను సైతం సత్కరించారు.
