బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్న సమయంలో లవ్ ఇన్సూరెన్స్ కట్టింది ఓ చైనీస్ అమ్మాయి. పదేళ్ల తర్వాత ఆ జంట పెళ్లి చేసుకున్నది. 28 డాలర్లకు ఆమె బీమా కట్టింది

షాంగ్జీ: చైనాలో ఓ మహిళ లవ్ ఇన్సూరెన్స్ పాలసీ చేసి జాక్‌పాట్ కొట్టేసింది. సెంట్రల్ చైనాలోని షాంగ్జీ ప్రావిన్సుకు చెందిన వూ అనే అమ్మాయి 2016 సంవత్సరంలో 199 యువాన్లకు.. అంటే 28 డాలర్లకు లవ్ బీమా చేయించింది. అయితే పదేళ్ల డేటింగ్ తర్వాత ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడింది. ఆ లవ్ పాలసీతో ఆమె పదివేల యువాన్లను అంటే 1400 డాలర్లు విత్‌డ్రా చేసుకున్నది. వూ, వాంగ్లు 2025లో మ్యారేజ్ రిజిస్టర్ చేసుకున్నారు. ఒకే యూనివర్సిటీలో చదువుకున్న ఆ జంట.. 2015 నుంచి రిలేషన్లో ఉన్నారు.
