జాతీయ రహదారి విస్తరణ పనుల్లో అడిగినంత కమీషన్ కాంట్రాక్టర్ ఇవ్వనందుకు ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఈ నెల 6న పట్టపగలు హంగామా సృష్టించారు.

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో అడిగినంత కమీషన్ కాంట్రాక్టర్ ఇవ్వనందుకు ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఈ నెల 6న పట్టపగలు హంగామా సృష్టించారు. మారణాయుధాలతో పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి కాంట్రాక్టర్కు వార్నింగ్ ఇచ్చారు. కమీషన్ ఇస్తరా.. చస్తరా? అంటూ బెదిరించడమే కాకుండా అక్కడున్న నిర్మాణ సామగ్రిని, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో సిబ్బంది, కూలీలు బెదిరి పారిపోయారు.
