అంగన్వాడీ కేంద్రాల్లో రెగ్యులర్ టీచర్లను నియామకం చేయాలని స్థానిక సర్పంచ్ మాచర్ల కుమార స్వామి ఐసీడీఎస్ సీడీపీఓ స్వరూపను కోరారు.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో రెగ్యులర్ టీచర్లను నియామకం చేయాలని స్థానిక సర్పంచ్ మాచర్ల కుమార స్వామి ఐసీడీఎస్ సీడీపీఓ స్వరూపను కోరారు. సోమవారం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం (కోడి గుడ్లు, పాలు, బాలామృతం) పంపిణీ కార్యక్రమం జరిగింది.
