పట్టణ శివారు మెట్ పల్లి రోడ్డు లోని జిఎస్ గార్డెన్ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొంది.

జాతీయ రహదారిపై ఇటీవల రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో ఆర్టీసీ డ్రైవర్ బస్సు వేగాన్ని నియంత్రించడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు డ్రైవర్ ప్రమాదవశాత్తు బస్సును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కాగా మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కోరుట్లకు వైపు వస్తుండగా నిజామాబాద్ నుంచి కారులో ఐదుగురు కుటుంబ సభ్యులు సమ్మక్క సారలమ్మ జాతరకు వెళుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
