రోహింగ్యాల అక్రమ నివాసాలతో భద్రతకు ముప్పు – శ్రీరాములు అందెల

బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా, అలాగే మన ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఈ నెల 24న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్లోని మీర్పేట్ డివిజన్లో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ గారు, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు గారు, ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు ఆలే భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవ రెడ్డి గారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు తీవ్రంగా ఖండించదగినవి….ఇవి కేవలం హిందువులపై మాత్రమే కాదు, మానవ హక్కులపై జరుగుతున్న దాడులు… ప్రపంచం మొత్తం దీనిపై స్పందించాలి అని అన్నారు. అనంతరం శ్రీరాములు గారు మాట్లాడుతూ హిందువులపై ఎక్కడ దాడులు జరిగినా హిందూ సమాజం మొత్తం ఒక్కటిగా స్పందించాలి అని, మన ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల వల్ల దేశ భద్రతకు, స్థానికుల జీవన విధానానికి ముప్పు ఏర్పడుతోంది అని… దీనిపై ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి అని ఈ మహాసభ ద్వారా ప్రజల గొంతుకను బలంగా వినిపించాలి” అని తెలిపారు. ఈ మహాసభ రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజ ఆత్మగౌరవానికి సంబంధించినది. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా పాల్గొని సభను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు. సభ విజయానికి కార్యాచరణపై చర్చ
సమావేశంలో సభ నిర్వహణ, ప్రచారం, జనసమీకరణపై విస్తృతంగా చర్చించారు. హిందూ సంఘాలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి నాయకులు సంజయ్ గణాతే, కీసర గోవర్ధన్ రెడ్డి, కోడూరు సోమేశ్వర్, చిల్లంపల్లి రాజశేఖర్, బిజెపి అధ్యక్షులు ముఖేష్ ముదిరాజ్, బిక్షపతి చారి, పెండ్యాల నరసింహ, మాజీ కార్పొరేటర్లు, వివిధ క్షేత్రాల నాయకులు పాల్గొన్నారు.
