రోడ్డుపై ప్రయాణం చేసే ప్రతీ ఒక్కరూ రోడ్డు నియమాలు, నిబంధనలు పాటించాలని బోధన్ ఎంవీఐ డీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాసు కోరారు.

శక్కర్ నగర్ : రోడ్డుపై ప్రయాణం చేసే ప్రతీ ఒక్కరూ రోడ్డు నియమాలు, నిబంధనలు పాటించాలని బోధన్ ఎంవీఐ డీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాసు కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా గురువారం బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ముందుగా ప్రతిజ్ఞ చేయించారు.
