అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువుల్లో నుంచి యథేచ్చగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది.

ఇసుక వ్యాపారం మూడు పువ్వు లు.. ఆరు కాయలుగా సాగుతూ కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లు, ఇతరత్రా నిర్మాణాలకు భారీగా ఇసుక అవసరం ఏర్పడడంతో ఇదే అదునుగా భావించి ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. నియోజకవర్గంలోని చెరువులే అడ్డగా రాత్రి వేళ్లలో ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది. ఈ అక్రమ ఇసుక దందాపై స్థానికులు ఫిర్యాదులు చేసి నా సంబంధిత అధికారులు అరకొర దాడు లు చేసి, ఆ తర్వాత చేతులు దులుపుకొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాల్టా చట్టానికి దర్జాగా తూట్లు పొడుస్తున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
