మండలంలోని తూంపల్లి పరిధిలో ఉన్న కొత్త తిరుపతి గుట్ట కంపార్ట్మెంట్ నంబర్ 500 బీట్ అటవీ ప్రాంతంలో జిట్టపులి సంచరిస్తున్నది.

సిరికొండ, జనవరి 7: మండలంలోని తూంపల్లి పరిధిలో ఉన్న కొత్త తిరుపతి గుట్ట కంపార్ట్మెంట్ నంబర్ 500 బీట్ అటవీ ప్రాంతంలో జిట్టపులి సంచరిస్తున్నది. మంగళవారం రాత్రి ఓ లేగదూడను హతమార్చిం ది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన కాప్చర్ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. గోప్యానాయక్తండాకు చెందిన దూడ యజమాని ఇచ్చిన సమాచారం మేర కు ఇన్చార్జి ఎఫ్ఆర్వో రవీందర్ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పశువైద్యాధికారి అభిషేక్ లేగదూడ కళేబరానికి అక్కడే పంచనామా నిర్వహించారు. దూడ విలువ రూ.30వేలు ఉంటుందని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి పరిహారం అందేలా చూస్తామని ఎఫ్ఆర్వో తెలిపారు.
