జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టు ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా రూ. కోటి 79 లక్షల 35,866 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వెల్లడించారు.

జగిత్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టు ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా రూ. కోటి 79 లక్షల 35,866 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. 84 రోజులకు సంబంధించి ఆలయంలోని 13 హుండీల లెక్కింపు జరుపగా ఈ ఆదాయం వచ్చిందన్నారు. మిశ్రమ వెండి, బంగారం సీల్ చేసి హుండీలో భద్రపరిచామని వివరించారు. 130 విదేశి కరెన్సీ వచ్చాయని తెలిపారు.
