చెప్పులు, బూట్లు తయారయ్యే ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని నరేలా భోర్గఢ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

దాంతో వారు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఏకంగా 12 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులంతా లోపలే ఉన్నారని, ఆ తర్వాత వారు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. కింది అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా అన్ని ఫ్లోర్లకు విస్తరించాయని చెప్పారు.
